సావోపాలో: మరికొద్ది రోజుల్లో జరగనున్న ఒలంపిక్ క్రీడలకు సిద్ధమవుతున్న బ్రెజిల్‌లోని రియో డి జెనిరియో నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. 16 ఏళ్ల బాలికను 33 మంది రేప్ చేశారన్న వ్యవహారంతో దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. భారత్‌లో జరిగిన నిర్భయ ఘటన తదనంతర పరిణామాలతో స్ఫూర్తి పొందిన కొందరు మహిళలు ఈ నేరాన్ని ఖండించడానికి గత గురువారం ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీ సృష్టించారు. దేశంలో అత్యాచారాలను వ్యతిరేకించాలనే ప్రధాన సందేశంతో పేజీని నింపారు.
నెమ్మదిగా సాగుతున్న పోలీసు విచారణ ప్రజల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. ‘భారత్‌లో జరిగిన నిర్భయ ఘటనను ఎవరు మర్చిపోగలరు. తరువాతి రోజు నుంచి వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి అలాంటి సంస్కృతికి అంతం పలకాలని నినదించారు’ అని ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. దీనికి ఎంతో ఆదరణ లభించింది. అన్ని వైపులా నుంచి సందేశాలు వెల్లువెత్తాయి. జూన్ 1న సావ్‌పాలోలో జరిగే భారీ నిరసన కార్యక్రమానికి హాజరవ్వాలని ఫేస్‌బుక్ ద్వారా లక్షా 60 వేల మందికి ఆహ్వానాలు అందాయి.
‘నిర్భయ’ స్ఫూర్తితో బ్రెజిల్ రేప్‌పై ఆందోళనలు
Published Tue, May 31 2016 2:31 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement