కలుషిత వాతావరణం కారణంగా ఏటా 17 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ప్రతి నలుగురు చిన్న పిల్లల్లో(ఐదేళ్ల లోపు వయసు) ఒకరి మరణానికి కారణం వారి చుట్టూ ఉన్న అనారోగ్యకరమైన వాతావరణమేనని స్పష్టం చేసింది. నీళ్ల విరేచనాలు, మలేరియా, నిమోనియా తదితర వ్యాధుల కారణంగా అత్యధికంగా ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నట్లు వెల్లడించింది.
కలుషిత వాతావరణం అన్నింటికన్నా ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డా. మార్గరెట్ చాన్ పేర్కొన్నారు. కలుషిత నీరు, గాలి వారి ఎదుగుదలకు కారణమయ్యే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. కొన్నిసార్లు తల్లి గర్భంలో ఉండగానే శిశువు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని లేదా నెలలు నిండకముందే తల్లి శిశువుకు జన్మనివ్వాల్సిన పరిస్ధితి ఏర్పడుతుందని చెప్పారు.
మూల్యం 17లక్షల మరణాలు
Published Mon, Mar 6 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
Advertisement
Advertisement