న్యూయార్క్: ఏడు దేశాల ముస్లింలపై, ఆ దేశాల నుంచి వస్తున్న శరణార్ధులపై వేసిన వేటుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. రోజుకో చేయి అదనంగా ఉద్యమంలోకి చేరుతోంది. ముఖ్యంగా ఉద్యమాలకు పేర్గాంచిన భారతీయులు కూడా భారీ సంఖ్యలోనే ట్రంప్ వ్యతిరేక ర్యాలీల్లో దర్శనం ఇస్తున్నారు. వారి చేతుల్లో ప్లకార్డులపై దిమ్మతిరిగే మాటలతో కనిపిస్తూ అమెరికన్లను ఆకట్టుకుంటున్నారు.
తమ దేశస్తులకంటే భారతీయులు చాలా నయం అని స్వదేశీయులు అనుకుంటున్నారంటే మనవాళ్లు ఏ రేంజ్‌లో ఉద్యమాల్లో దూసుకెళుతున్నారో తెలుసుకోవచ్చు. చాలా క్రియేటివిటీతో ప్లకార్డులు రాస్తూ నేరుగా తగిలేంతగట్టిగా డైలాగ్‌లు కొడుతున్నారు. పంజాబ్‌కు చెందిన ఓ పెద్దావిడ చేతిలో ఫితేమూ అని పోస్టర్ తో ఆకట్టుకుంటోంది.
అలాగే, డోనాల్డ్ ట్రంప్ ఓ కుక్క, కొన్ని చెప్పవీలుకానీ మాటలు, మా అమ్మనాన్నల పొట్టపై కొట్టకండి, మా ఆకలితో ఆటలాడుకోకండి, మీరెంత అసహ్యంచుకుంటున్నా మీకు చాయ్ అందించేందుకు మా బామ్మలు సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఇలా రకరకాల వ్యాఖ్యాలతో ట్రంప్ వ్యతిరేక నినాదాలతో అమెరికన్లను ఆకట్టుకుంటున్నారు.
దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి
(ట్రంప్ కూతురు ఇలా చేసిందేమిటి..?)
(అమెరికా బయట కాలుపెట్టి తిరిగి రాలేక..!)
(ట్రంప్ పై మైక్రోసాఫ్ట్ దావా..!)
(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)
(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్)
(ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు)
(ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!)
(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)
(ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?)
(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)
(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)
(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)