ప్రముఖ దర్శకుడి కన్నుమూత | ‘Jaane Bhi Do Yaaro’ director Kundan Shah dies of heart attack in Mumbai | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడి కన్నుమూత

Published Sat, Oct 7 2017 12:49 PM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

‘Jaane Bhi Do Yaaro’ director Kundan Shah dies of heart attack in Mumbai - Sakshi

ముంబై:  ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కుందన్‌ షా మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కుందన్‌షా(69) తన నివాసంలో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ‘‘జానే భి దో యారో’’ అనే చిత్రం ద్వారా వెండితెరపై తనదైన ముద్రవేసిన ఆయన ఆ తర్వాత అనేక మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘‘జానే భి దో యారో’’  చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది.  1984 లో దూరదర్శన్‌లో బాగా పాపులరైన కామెడీ సిరీస్‌ 'యహ్‌ జో హై జిందగీ' కు కుందన్‌ షా దర్వకత్వం వహించారు. కుందన్‌ షా మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కాగా దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులను నిరసినగా, అలాగే ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) విద్యార్థులకు మద్దతుగా 2015 నవంబర్‌లో 23 మంది దర్శకులతో కలిసి కుందన్‌ షా తన జాతీయ అవార్డును వెనక్కి పంపారు.

ఆయన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు
క్యా కహెనా (2000)
హమ్‌ తో మొహబ్బత్‌ కరెగా (2000)
దిల్‌ హై తుమ్హారా (2002)
ఏక్‌ సె బడ్‌కే ఏక్‌ (2004)
పీ సే పీఎం తక్‌ (2014)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement