’20శాతంమంది కారణంగా 80శాతంమందికి ఇక్కట్లు’
చెన్నై: ఇరవై శాతంమంది కారణంగా 80శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రముఖ దక్షిణాది నటుడు విజయ్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మీడియా ఆయనను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రజలు నేడు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
‘సాధారణ పౌరులే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. 20శాతం మంది కారణంగా 80శాతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అంటూ విజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన భైరవ అనే చిత్రంలో నటిస్తున్నారు.