‘అమ్మా నాన్న ఊరెళితే...?’
‘అమ్మా నాన్న ఊరెళితే...?’
Published Mon, Aug 19 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
పస్తుతం యువతరం భవిష్యత్తుని నాశనం చేస్తున్న అంశాలేంటి? ఏ మార్గం యువతరాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది? అని తెలిపే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే...?’. అంజి శ్రీను దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పాటలను ఈ నెల 30న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘సోనియా అగర్వాల్ చేసిన ప్రత్యేక పాట ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. యువతను టార్గెట్ చేస్తూ అంజి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కేవీ రాజు, కెమెరా: ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్.
Advertisement
Advertisement