అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!
ముంబై: ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్ని ప్రియుడు విరాట్ తో కలిసి ఆస్ట్రేలియాలో జరుపుకున్న అనుష్క.. తాజాగా సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ వద్ద హల్ చల్ చేస్తూ మీడియా కంటపడింది. గురువారం ఈ జంట బయటకొచ్చి ఆస్ట్రేలియాలోని పలుప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. గత కొంతకాలంగా వీరద్దరూ డేటింగ్ చేస్తున్నవిషయం తెలిసిందే.
ప్రస్తుతం అనుష్క శర్మ 'పీకే' మూవీ భారీ విజయంతో మంచి జోష్ లో ఉండగా.. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ అద్వితీయమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. విరాట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అనుష్క స్టేడియానికి రావడం కూడా అభిమానుల్లో మంచి ఊపును తెస్తుంది. అనుష్క స్టేడియంలో ఉన్న సమయాన విరాట్ సెంచరీ చేస్తే మాత్రం తన బ్యాట్ తో ప్రియురాలికి ఓ కిస్ ను కూడా ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.