ప్రభాస్ బాహుబలిగా డార్లింగ్ | Darling telugu movie in tamil dubbed | Sakshi
Sakshi News home page

ప్రభాస్ బాహుబలిగా డార్లింగ్

Published Thu, Apr 21 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

ప్రభాస్ బాహుబలిగా డార్లింగ్

ప్రభాస్ బాహుబలిగా డార్లింగ్

 టాలీవుడ్‌లో విజయవంతమైన పలు చిత్రాలను తమిళంలోకి అనువదిస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు భద్రకాళీ ఫిలింస్ అధినేతలు. అంతకు ముందు సెల్వందన్, ఇదుదాండా పోలీస్, బ్రూస్‌లీ-2, మగధీర, ఎవండా తదితర చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన వీరు తాజాగా తెలుగులో సూపర్‌హిట్ అయిన డార్లింగ్ చిత్రాన్ని ప్రభాస్ బాహుబలి పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. దక్షిణాదిలో తెరకెక్కి ప్రపంచస్థాయి రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం బాహుబలి. ఆ చిత్ర కథానాయకుడు నటించిన మరో సూపర్‌హిట్ చిత్రం డార్లింగ్.
 
 అందాల నటి కాజల్‌అగర్వాల్ ఆయనతో రొమాన్స్ చేసిన ఈ చిత్రంలో ప్రభు, ముఖేష్ రిషీ, తులసి, కోట శ్రీనివాసరావు, ఆహుతిప్రసాద్, చంద్రమోహన్, ఎంఎస్.నారాయణ, చంద్రబోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం తమిళంలో సత్య సిద్దాల, అడ్డాల వెంకట్రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌కే.రాజరాజా మాటలను అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం చెన్నై, ఏవీఎం స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను ప్రముఖ స్టంట్‌మాస్టర్ జాగ్వుర్ తంగం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఆర్‌కే.
 
  రాజరాజా మట్లాడుతూ ఇందులో హీరో హీరోయిన్లు చిన్నతనం నుంచి కలిసి చదువుకుంటారన్నారు. పెద్దయిన తరువాత బాల్యమిత్రులందరూ కలుసుకుంటారని ఆ కలయిక తరువాత హీరోహీరోయిన్ల మధ్య స్నేహం ఎలా ప్రేమగా మారింది. ఇటువంటి అంశాల సమాహారమే ప్రభాస్ బాహుబలి అని తెలిపారు. భద్రకాళీ ఫిలింస్ అధినేతలు చె ప్పినట్టుగానే నెలకో చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన వీరు తాజాగా అల్లుఅర్జున్ నటించిన సరైనోడు తమిళం హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement