మానగరంలో రెజీనా | Managaram movie in Regina | Sakshi
Sakshi News home page

మానగరంలో రెజీనా

Published Mon, Mar 7 2016 3:29 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మానగరంలో రెజీనా - Sakshi

మానగరంలో రెజీనా

నటి రెజీనా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది రెజీనా వ్యక్తి గతం అయితే వృత్తిపరంగా చెప్పాలంటే రెజీనా ప్రస్తుతం తమిళంలో కంటే తెలుగులోనే మంచి ఫామ్‌లో ఉన్నారు. తమిళంలో కొంచెం గ్యాప్ తరువాత మానగరం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్, శ్రీ హీరోలుగా నటిస్తున్నారు. నవ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సిటీ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం అని అంటున్నారాయన.

ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చిన నలుగురు మిత్రుల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మానగరం అని వెల్లడించారు.ఈ సందర్భంగా వారికి ఎదురైన సంఘటనలు, సమస్యలు,వాటి నుంచి ఎలా బయట పడ్డారన్న సన్నివేశాల సమాహారమే చిత్రం అన్నారు.అయితే సందీప్ కిషన్, శ్రీలలో రెజీనా ఎవరిని ప్రేమిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement