ముంబై గ్యాంగ్ రేప్ ఘటన హత్య లాంటిదే: కాజోల్ | Mumbai gangrape: Kajol wants stricter laws against crime | Sakshi
Sakshi News home page

ముంబై గ్యాంగ్ రేప్ ఘటన హత్య లాంటిదే: కాజోల్

Published Tue, Aug 27 2013 8:07 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

ముంబై గ్యాంగ్ రేప్ ఘటన హత్య లాంటిదే: కాజోల్ - Sakshi

ముంబై గ్యాంగ్ రేప్ ఘటన హత్య లాంటిదే: కాజోల్

గత వారం ముంబైలో ఫోటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ పై బాలీవుడ్ నటి కాజోల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మానభంగాలకు, మహిళలపై దారుణాలకు పాల్పడే వారిపై కఠిన శిక్ష విధించే విధంగా చట్టాలను రూపొందించాలని కాజోల్ డిమాండ్ చేసింది. 
 
'గ్యాంగ్ రేప్ ఘటన చాలా దారుణం. ఇలాంటి ఘటనపై మాట్లాడటానికి మాటలు రావడం లేదు. దాదాపు ఈ ఘటన హత్యతో సమానం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌరులంతా చర్యలు తీసుకోవాలి' అని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితులు ఇలాంటి దారుణాలకు ప్రయత్నించడానికే భయపడేంతగా చట్టాలు తీసుకురావాలన్నారు. 
 
గురువారం సెంట్రల్ ముంబైలోని పారేల్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఫోటో జర్నలిస్ట్ పై ఐదుగురు దుండగులు సామూహిక మానభంగం జరిపిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement