ఎన్టీఆర్ నా అభిమాన హీరో | NTR is My Favorite Actor, says Srikanth | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ నా అభిమాన హీరో

Published Sun, Jan 12 2014 9:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

ఎన్టీఆర్ నా అభిమాన హీరో

ఎన్టీఆర్ నా అభిమాన హీరో

విశాఖపట్నం: అవకాశం వస్తే శ్రీకృష్ణుడిగా నటించాలని ఉందని ప్రముఖ హీరో శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేటట్టు లేదన్నారు. శ్రీకృష్ణాపురంలోని గోశాలకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పెళ్లి సందడి సినిమా తన కెరీయర్‌లో పెద్ద హిట్ అన్నారు. ఇప్పటి వరకు వెండి తెరపై తాను నటించిన సినిమాల్లో అన్ని పాత్రలు ప్రేక్షకులు మెచ్చినవేనని చెప్పారు.
 
 
తాజ్‌మహల్, ఖడ్గం, ప్రేయసిరావే తదితర చిత్రాలు తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయన్నారు. ప్రస్తుతం తరుణ్‌తో కలిసి వేట సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ఈ సినిమాతో పాటు మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, మొండోడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రామ్‌చరణ్‌తో కలిసి కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా, జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. నందమూరి తారకరామారావు తన అభిమాన హీరో అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement