భరత్ అంత్యక్రియలకు రాలేను: రవితేజ
హైదరాబాద్: తన సోదరుడు అంత్యక్రియలకు హాజరుకాలేనని టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజ అన్నారు. చిధ్రమైన తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరి చూపు చూసి భరించలేనని ఆయన వెల్లడించారు. 30 ఏళ్లుగా తన తమ్ముడు భరత్‌తో ఉన్న అనుబంధాన్ని రవితేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగం అయ్యారు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం భరత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ కూడా హాజరుకాలేదని తెలిసింది.
దీంతో అంత్యక్రియలకు హాజరుకాలేని తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని రవితేజ మీడియాను మిత్రులను కోరారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డులో ఆగి వున్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో తొలుత ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన భరత్ భౌతిక కాయాన్ని అక్కడి నుంచి నేరుగా మహా ప్రస్థానానికి తరలించారు. రవితేజ మరో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షించారు. నటులు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, పలువురు సమీప బంధువులు, మిత్రులు హాజరయ్యారు.
ఇంకా చదవండి:హీరో రవితేజ సోదరుడి దుర్మరణం