అందం హిందోళం...అధరం తాంబూలం
‘‘ఏ కారైనా అడ్డుగా ఉంటే హారన్ కొట్టు! తప్పు లేదు! కానీ నెత్తి మీద ‘సుప్రీమ్’ పేరుతో ఓ క్యాబ్ ఉంటుంది. దాని వెనక మాత్రం ఎంత సెలైంట్‌గా ఉంటే అంత మంచిది’’ అనుకుంటూ ఉంటారు ఆ ఊరిలో క్యాబ్ డ్రైవర్లు. అందులో ఉన్నది బాలు మరి! హారన్ కొడితే మాత్రం హారర్ సినిమా చూపించేస్తాడు. ఇలాంటోడు ఓ పోలీస్ అమ్మాయినే ప్రేమలోకి దింపుతాడు.
ఆ అమ్మాయి పేరు బెల్లం శ్రీదేవి. ఎప్పటికైనా పోలీస్‌గా మెడల్ సాధించాలని ఆశ. ఇలాంటి లవ్‌ప్టోరీలోకి ఓ చిన్న పిల్లాడు ఎంటరవుతాడు. అప్పటి నుంచి బాలు జీవితంలో ఘాట్‌రోడ్డులా మలుపులే మలుపులు... అవేంటో తెలియాలంటే వచ్చే నెల 5న విడుదల కానున్న ‘సుప్రీమ్’ చిత్రం చూడాలంటున్నారు నిర్మాత ‘దిల్’ రాజు. బాలుగా సాయి ధరమ్ తేజ్, పోలీస్ పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్‘ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘చిరంజీవిగారి హిట్ ఫిల్మ్ ‘యముడికి మొగుడు’లోని పాపులర్ సాంగ్ ‘అందం హిందోళం... అధరం తాంబూలం...’ను ఇందులో రీమిక్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటుంది. జోధ్‌పూర్ ప్యాలెస్, అమీర్‌గఢ్ ప్యాలెస్‌లలో ఈ పాట తీశాం. రాజస్థాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి హైలైట్’’అని చెప్పారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్.