నేను ఆంటీ అయితే ఆయనేంటి?
ముంబై: సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలను తప్పుబట్టిన గాయని సోనా మహాపాత్రపై అతడి అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. సల్మాన్ ను 50 ఏళ్ల బాలుడిగా పోల్చడంపై ఫైర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలపై స్పందిస్తూ...మహిళల గెంటివేత, హిట్ అండ్ రన్, వన్యప్రాణుల వేట కేసుల్లో నిందితుడిగా ఉన్న హీరోకు దేశంలో అభిమానించేవారు ఉండడం విడ్డూరమని సోనా పేర్కొన్నారు.
సోనా చేసిన కామెంట్స్ పై సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. 'సల్మాన్ కేసుల గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది. భారత న్యాయవ్యవస్థలో నీవేమైనా భాగమా' అని పోస్ట్ పెట్టారు. ఆమెను తిడుతూ అసభ్య పదజాలంతో ట్వీట్లు పెట్టారు. తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వారికి సోనా దీటుగా సమాధానం ఇచ్చారు.
'సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించినందుకు నాకు ఫోన్ చేసి నన్ను 40 ఏళ్ల ఆంటీ అంటున్నారు. నేను ఆంటీ అయితే 50 ఏళ్ల సల్మాన్ బాలుడా? మీరంతా 50 ఏళ్ల బాలుడిని వెనకేసుకురావడం హాస్యాస్పదంగా ఉంద'ని ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. తాను చేసిన కామెంట్స్ సరైనవేనని సల్మాన్ ఖాన్ 'చెమ్చాలు' నిరూపించారని సోనా కౌంటర్ ఇచ్చారు. తన అభిమానులకు హితబోధ చేయాలని సల్మాన్ ఖాన్ కు సూచించారు.
& now the 100's calling me a 40 year old aunty, slut, randi, to defend their 50 years old baby idol. Aah the irony! #India #PopularCulture
— #SonaLIVE (@sonamohapatra) June 21, 2016
Dear Bhai Chamcha's,
— #SonaLIVE (@sonamohapatra) June 21, 2016
You continue to prove my point with every perverted, sick, cheap message you write to me. HaHa pic.twitter.com/9lZAcydfHs