ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు | Thandie Newton reveals she was sexually abused by male director at audition | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు

Published Mon, Jul 4 2016 1:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు

ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు

న్యూయార్క్: కెరీర్ ప్రారంభసమయంలో కాస్టింగ్ చేసేటప్పుడు తనను ఓ డైరెక్టర్ లైంగికంగా వేధించాడని ప్రముఖ హాలీవుడ్ నటి తాండీ న్యూటన్ చెప్పింది. ఆడిషన్ సమయంలో అతడు తనతో ప్రవర్తించిన తీరును వీడియో తీసి అతడి స్నేహితులకు చూపించాడని పేర్కొంది. అయినా.. తన కెరీర్ కు అదే ప్రారంభం అవడం.. ఇండస్ట్రీకి కొత్త కావడంతో సహించానని చెప్పింది.

తనకు ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలని.. అయినా నిర్బయంగా బయటకు ఈ విషయం చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయంది. ఎట్టి పరిస్థితుల్లో యువ కథానాయికలు తనలా ఆలోచించవద్దని, జీవితాన్ని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేసుకోవద్దని చెప్పింది. అయితే, ఆమె ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. మిషన్ ఇంపాజిబుల్ వంటి ప్రముఖ హాలీవుడ్ చిత్రాల్లో ఈమె కీలక పాత్ర పోషించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement