హాలీవుడ్‌లో నంబర్‌ 2! | Victoria And Abdul, Ali Fazal's next Hollywood venture to begin in January 2020 | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో నంబర్‌ 2!

Published Sat, Mar 2 2019 12:34 AM | Last Updated on Sat, Mar 2 2019 12:34 AM

Victoria And Abdul, Ali Fazal's next Hollywood venture to begin in January 2020 - Sakshi

అలీ ఫజల్‌

‘విక్టోరియా అండ్‌ అబ్దుల్‌’... నటుడు అలీ ఫజల్‌ నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రమిది. కాస్ట్యూమ్‌ డిజైన్, బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ విభాగాల్లో ఈ చిత్రం 90వ ఆస్కార్‌ అవార్డ్స్‌కి నామినేట్‌ అయ్యింది. ఇప్పుడు అలీ తన రెండో హాలీవుడ్‌ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. తన రెండో హాలీవుడ్‌ సినిమా గురించి అలీ ఫజల్‌ మాట్లాడుతూ– ‘‘ఇది బయోపిక్‌.  వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది.

ఈ సినిమాలో నేను ఒక లీడ్‌ రోల్‌ చేయబోతున్నా. నాకు అక్కడ పెద్దగా మార్కెట్‌ లేదు. అందుకే ఇతర కీలక పాత్రలకు పెద్ద స్టార్స్‌ ఈ సినిమాలో భాగం అయితే మరింత మైలేజ్‌ వస్తుంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది చివర్లోనే స్టార్ట్‌ కావాల్సింది. కానీ నాకు ఉన్న కొన్ని కమిట్‌మెంట్స్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ 2020లో స్టార్ట్‌ కావచ్చని అనుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌కు చెందిన ఓ వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement