మళ్లీ ప్రకృతి చికిత్స చేయించుకుంటున్న సీఎం!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు వస్తున్నారు. ఆయన జిందాల్ నేచర్ క్యూర్ ఇన్‌స్టిట్యూట్‌లో పదిరోజుల పాటు ప్రకృతి చికిత్స చేయించుకోనున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడిన కేజ్రీవాల్ గత ఏడాది మార్చి నెలలో ఇక్కడ ప్రకృతి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ హై షుగర్ లెవల్స్ తో కూడా బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గత డిసెంబర్ 22నే ఆయన బెంగళూరుకు వెళ్లాలనుకున్నారు. అయితే, ఢిల్లీలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన సరి-బేసి విధానాన్ని పర్యవేక్షించడానికి ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన కేజ్రీవాల్ ఈ నెల 31న బెంగళూరు నగరంలో జరిగే పార్టీ ర్యాలీలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.