అంతా అయోమయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటుండడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరితో నూ మాట్లాడకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై గురువారం కూడా అనిశ్చితి కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఆప్ అగ్రనాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించడం వరకే పరిమితమయింది. కేజ్రీవాల్ మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సహా కాంగ్రెస్, బీజేపీపై ట్వీట్లతో విమర్శలు కురిపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ ఆహ్వానిస్తే తాము సుముఖంగా ఉన్నామంటూ బీజేపీ సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ బేరాలాడుతోందని కేజ్రీవాల్ ఆరోపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ విషయాలపై గురువారం ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్లు సంచలనం సృష్టించాయి.
ప్రభుత్వం ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎన్నికలు జరిపిం చాలని కోరుతున్న ఈ ఆప్ నేత... బీజేపీ, ఎల్జీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయవల సిందిగా ఎల్జీ గురువారం బీజేపీని ఆహ్వానించవచ్చ ని బుధవారం రాత్రి కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఈ ఆహ్వానానికి అంగీకరిస్తుందని జోస్యం చెప్పారు. దీనికి బీజేపీ స్పందిస్తూ ఈ ఊహాగానం అబద్ధమైతే ఆయన ఢిల్లీవాసులకు క్షమాపణ చెబుతారా ? అని ప్రశ్నించింది. కేజ్రీవాల్ తన ఆరోపణలకు రుజువు లు చూపాలని లేనట్లయితే, లేకుంటే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి, క్షమాపణ చెప్పాలం టూ నోటీసులు పంపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం సరికాదని వాదిస్తున్న కేజ్రీవాల్ గురువారం ఉదయం ఎల్జీ నజీబ్‌జంగ్‌పై ట్వీట్లతో దాడి చేశారు.
ట్వీట్ల వెల్లువ..
ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గురువారం ఆహ్వానిస్తారని కేజ్రీవాల్ తొలుత ట్వీట్ చేశారు. తదనంతరం వెంటనే మరో ట్వీట్‌లో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదని పేర్కొన్నారు. ‘ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యేలను కొనడం సులభ మవుతుందని బీ జేపీ అనుకుంటోంది. ఓ పార్టీకి తగిన సంఖ్యాబలం ఉన్నట్టు నిర్ధారణ కాకముందే ఎల్జీ దానిని ప్రభుత్వం చేయడం కోసం ఆహ్వానిస్తారా? ప్రభుత్వ ఏ ర్పాటుకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా సమర్పించవలసిందిగా ఎల్జీ కోరాలి కదా! లేనట్లయితే ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్టే అవుతుంది.
ఏ పార్టీకి తగిన సంఖ్యాబలం లేదని తెలిసినప్పటికీ ఎల్జీ ఒక పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించి ఎమ్మెల్యేల బేరసారాలను ప్రోత్సహిస్తా రా?’ అంటూ ట్వీట్ల సందేశాలు కురిపించారు. ప్ర భుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోతే జంగ్‌ను బదిలీ చేయవచ్చని లేదా తొలగింవచ్చని హెచ్చరిం చారు ఎల్జీ తన కుర్చీని కాపాడుకుంటారా లేక రాజ్యాంగాన్ని కాపాడుతారా అనే విషయాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందని కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఎల్జీతో భేటీ అయ్యేందుకు కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోరగా, అందుకు ఆయన నిరాకరించారు.
కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించిన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న కేజ్రీవాల్ చేసిన ఊహాగానాన్ని బీజేపీ ఖండించిం ది. ఎల్జీ గురువారం తమను ఆహ్వానించకపోతే కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతా ద్వారా ఢిల్లీవాసులందరికీ క్షమాపణ చెబుతారా? అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రశ్నించారు. ‘ఇది మరో పచ్చి అబద్ధం.ఇంతకన్నా ఏం చెప్పగలను? తిలక్‌లేన్ నుం చి 7 రేస్‌కోర్సు రోడ్డుకు (ప్రభుత్వ అధికార నివా సం) వెళ్లాలనుకున్న కేజ్రీవాల్ కలలు కల్లలయ్యా యి’ అని ఉపాధ్యాయ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించారు. బీజేపీ ఎన్నడూ బేరసారాలకు పాల్పడలేదని, అది తమ విధానం కాదని రూఢీగా చెప్పగలనని రాజ్‌నాథ్ చెప్పారు.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు : గడ్కరీ
ప్రభుత్వ ఏర్పాటుపై తాము ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ గురువారం అన్నారు. పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాయని స్పష్టీకరించారు. కేజ్రీవాల్ చేసేవన్నీ నిరాధార ఆరోపణలన్నారు. కేజ్రీవాల్ నిస్పృహతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్షించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 49 రోజులకే కేజ్రీవాల్ పలాయనం చిత్తగించారని, రోడ్లపై ధర్నా, ప్రదర్శనలకు దిగారని ఆయన విమర్శించారు. ఢిల్లీని నాశనం చేసిన వారు ఇప్పుడు జ్యోతిషులుగా మారి తరువాత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో జోస్యం చెబుతున్నారని నఖ్వీ ఎగతాళి చేశారు. ఎవరు బేరసారాలకు పాల్పడుతున్నారో.. అందుకు బాధ్యులె వరో చెప్పాలని ఆయన కేజ్రీవాల్‌ను నిలదీశారు. ఏది జరిగినా రాజ్యాంగబద్దంగానే జరుగుతుందని, ఆయన చింతించాల్సిందేమీ లేదని నఖ్వీ అన్నారు.
కనిపించని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు హరూన్ యూసుఫ్, అర్విందర్ సింగ్ లవ్లీ మినహా మిగతా ఆరుగురు శాసన సభ్యులు ఫోన్ ఎత్తకపోవడం, మీడియాతో మాట్లాడకపోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. డీపీసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ పరిశీలకుల సమావేశానికి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అయితే బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాడ కనిపించడలేదు. బీజేపీ బేరసారాలు జరుపుతోందన్న ఆరోపణలకు వీరి గైర్హాజరు బలం చేకూర్చింది. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్న ఆరోపణలను ఖండిం చారు. అరవింద్ కేజ్రీవాల్ ఎవరిపై ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు చేస్తారో తెలియదని, విశ్వసనీయతలేని ఆయన ఆరోపణలు నమ్మలేమని యూసుఫ్ అన్నారు.