న్యూఢిల్లీ: దేశంలోని వివిధ సహాయక కేంద్రాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కోరింది. సహాయ కేంద్రాల్లో ఉన్న కార్మికులకు ఆహారం, వసతి, ఔషధాలు, సాధారణ కాల్, వీడియో కాల్.. మొదలైన సౌకర్యాలన్నీ కల్పించాలంటూ సంబంధిత మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించింది.
కాగా, లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు ఎక్కడిక్కడ చిక్కుకుపోయారు. ఉపాధి కోల్పోయి తినడానికి తిండలేక వారంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వేలాది కార్మికులు కాలినడన తమ సొంతూళ్లకు వెళుతున్నారు. ఆకలికి తాళలేక, అనారోగ్య సమస్యలతో పలువురు కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో వలస కార్మికులను ఆదుకునేందుకు కేంద్రానికి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది చదవండి: లాక్‌డౌన్.. కరోనా గాన్!
Comments
Please login to add a commentAdd a comment