జమ్మూలో కాల్పులు: గాయపడ్డ భారత జవాను | jawan injured in cross-border firing | Sakshi
Sakshi News home page

జమ్మూలో కాల్పులు:గాయపడ్డ భారత జవాను

Published Mon, Aug 5 2013 8:03 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

jawan injured in cross-border firing

జమ్మూ: కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో సోమవారం చోటు చేసుకున్నకాల్పుల్లో ఒక భారత జవాను గాయపడ్డాడు.  భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న సాంబా జిల్లాలో అకస్మికంగా కాల్పులు జరగడంతో రామ్ నివాస్ మీనా అనే జవాను గాయపడ్డాడు.  ఈ కాల్పుల్లో 200 బెటాలియన్‌కు చెందిన  మీనా  ఛాతిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో  తీవ్ర గాయాలైయ్యాయి.  తీవ్రంగా గాయపడిన జవాన్‌కు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది..

నరైన్ పూర్ సరిహద్దు ప్రాంతంలో రెండు రౌండ్లు కాల్పులు అకస్మికంగా జరిగాయాని ఓ బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపాడు.  సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పులు పాకిస్థాన్ సరిహద్దుల నుంచే జరిగి ఉండవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన అనంతరం బీఎస్‌ఎఫ్ జవాన్లు ఎటువంటి ఎదురుదాడికి పాల్పడలేదన్నాడు.
 
. .
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement