విదేశాలకు సోనియా.. ఎక్కడికో తెలియదు | Sonia Gandhi leaves for short visit abroad | Sakshi
Sakshi News home page

విదేశాలకు సోనియా.. ఎక్కడికో తెలియదు

Published Sat, Jun 20 2015 5:29 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

విదేశాలకు సోనియా.. ఎక్కడికో తెలియదు - Sakshi

విదేశాలకు సోనియా.. ఎక్కడికో తెలియదు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం విదేశాలకు పయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టునుంచి బయలుదేరిన ఆమె.. వారం రోజులపాటు విదేశాల్లోనే ఉంటారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలా మీడియాకు చెప్పారు. అయితే సోనియా గాంధీ ఏ దేశం వెళ్లారో, ఏ కారణం చేత వెళ్లారో మాత్రం ఆయన వెల్లడించలేదు. సోనియా పర్యటన పూర్తిగా వ్యక్తిగతం(పర్సనల్) అని మాత్రమే సర్జేవాలా సమాధానమిచ్చారు.

సోనియా తనయుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే ఆయన విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని విశ్వసనీయ సమాచారం. రాహుల్ పర్యటన కూడా పూర్తిగా వ్యక్తిగతమైనదేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement