సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా లభిస్తే ఏయే ప్రయోజనాలు చేకూరతాయో.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఏపీకి అవే ప్రయోజనాలు లభిస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చిన స్పెషల్ కేటగిరీలో రాష్ట్రాలకు సాయం చేసే ప్రక్రియను రద్దు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఏపీకి 2014-15లో రూ. 3,090 కోట్లు ఇచ్చామని, హోదావల్ల చేకూరే ప్రయోజనాలే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందుతాయని రాధాకృష్ణన్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని రాజ్యసభలో విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఒక్క ఏపీలోనే 1.86 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారని, సీపీఎస్‌కు వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment