‘అరుణచల్కు మంచిరోజు, కాంగ్రెస్కు చెడ్డరోజు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేకనే అరుణాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలంతా ఆ పార్టీని వదిలేశారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
‘అరుణాచల్ ప్రదేశ్‌కు ఇది మంచిరోజు. కాంగ్రెస్కు చెడ్డరోజు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీని వీడిపోతున్నారు. ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. నాయకత్వంపై విశ్వాసం సడలిపోయింది. అందుకే సీఎం సహా ఎమ్మెల్యేలు ప్రాంతీయ పార్టీలో చేరిపోయారు. గతంలో బీజేపీని నిందించారు. ఇది ఎందుకు జరిగింది. అరుణాచల్ కాంగ్రెస్‌లో పరిస్థితిలో బాగోలేదు. మునిగిపోతున్న నావను విడిచిపోయారు..’ అని పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 44 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి ఫెమా ఖండూ సహా 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలో చేరుతున్న విషయం తెలిసిందే. కాగా మూడింట రెండు వంతుల మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్లకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు.
Whom will the Congress blame now? Good days for #ArunachalPradesh , Bad days for Congress...
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 16 September 2016