కోడెల కోట్లు లూటీ చేశారు! | Vijaya Sai Reddy Slams Kodela Siva Prasad Rao | Sakshi
Sakshi News home page

కోడెల కోట్లు లూటీ చేశారు!

Published Wed, Jun 5 2019 11:12 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Vijaya Sai Reddy Slams Kodela Siva Prasad Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ చేసిన కోడెల శివప్రసాద్‌ రావు స్పీకర్‌ పదవికే కళంకం తెచ్చారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. బుధవారం ట్విటర్‌ వేదికగా కోడెల చేసిన అవినీతిని బయటపెట్టారు. ‘ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు. చ.అడుగుకు రూ.16 అద్దె అయితే... పైరవీ చేసుకుని రూ.25 తీసుకున్నారు. నాలుగున్నర కోట్ల పైనే లూటీ చేశారు.’ అని ట్వీట్‌ చేశారు.

హృదయపూర్వక ధన్యవాదాలు
పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి విజయసాయి రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ లోక్‌సభ పక్ష నేతగా నియమితులైన పి.మిథున్‌ రెడ్డి, చీఫ్‌ విప్‌గా నియమితులైన మార్గని భరత్‌ రామ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement