జగన్‌కు స్వాగతం పలికేందుకు వేచి ఉన్న పార్టీ నాయకులు , మధురపూడి ఎయిర్‌పోర్టుకు వస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మధురపూడి (కోరుకొండ): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం మధురపూడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆయన ఇక్కడి నుంచి స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్ర నిర్వహించుకుని ఆయన ప్రత్యేక కాన్వాయ్‌లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి స్పైస్‌జెట్ విమానంలో 12.15 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. ఆయనకు పార్టీ నాయకులు మధురపూడి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఆయనతో పాటు విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త యూవీ రమణమూర్తిరాజు, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వెళ్లారు.
విమానాశ్రయంలో జగన్‌ను ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పశ్చిమగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, జీఎస్ రావు, రాజమహేంద్రవరం సిటీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కో–ఆర్డినేటర్ బీఎస్ నాయుడు, గోపాలపురం కో–ఆర్డినేటర్ సలారి వెంకట్రావు, రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నేతలు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, రెడ్డి రాధాకృష్ణ, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, గుర్రం గౌతమ్, అడపా హరి, నక్కా రాజబాబు, అనిల్‌రెడ్డి, గిరజాల బాబు, మేడపాటి అనిల్‌రెడ్డి తదితరులు కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment