సైనాపై సినిమా! | A movie on Indian badminton star Saina Nehwal | Sakshi
Sakshi News home page

సైనాపై సినిమా!

Published Fri, Dec 18 2015 12:03 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

సైనాపై సినిమా! - Sakshi

సైనాపై సినిమా!

బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై  ఓ సినిమా రాబోతోంది. డెరైక్టర్ అమోల్ గుప్తా ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రారంభంకానుంది. సైనా తండ్రి హర్‌వీర్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఈ సినిమాకు సంబంధించిన హక్కులను తీసుకుందని తెలిపారు.

‘డెరైక్టర్ గుప్తా, ఫైనాన్సర్ సుజోవ్ జయరాజ్‌లు బుధవారం హైదరాబాద్‌లోని మా ఇంటికి వచ్చారు. సైనాపై సినిమా తీస్తున్న విషయాన్ని చెప్పారు. అరగంట పాటు మా మధ్య సమావేశం జరిగింది. సైనాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు’ అని హర్‌వీర్ పేర్కొన్నారు. ఈ సినిమాలో సైనా పాత్రను బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, ఆలియా భట్‌లలో ఒకరు పోషించే అవకాశాలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement