శ్రీశాంత్‌ నిషేధంపై బీసీసీఐ అప్పీల్‌ | BCCI appeal against Sreesanth's ban | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్‌ నిషేధంపై బీసీసీఐ అప్పీల్‌

Published Fri, Aug 11 2017 3:09 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

శ్రీశాంత్‌ నిషేధంపై బీసీసీఐ అప్పీల్‌

శ్రీశాంత్‌ నిషేధంపై బీసీసీఐ అప్పీల్‌

న్యూఢిల్లీ: పేసర్‌ శ్రీశాంత్‌పై తాము విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఎత్తివేయడంపై బీసీసీఐ న్యాయపోరాటం చేయనుంది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బోర్డు కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేయనుంది. 2013లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై బోర్డు శ్రీశాంత్‌ను క్రికెట్‌ నుంచి నిషేధించింది.

అయితే గత సోమవారం కేరళ హైకోర్టు సింగిల్‌ జడ్జి సరైన సాక్ష్యాలు లేవంటూ నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ అతడిని తిరిగి క్రికెట్‌లోకి అనుమతించడంపై బోర్డు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ‘కోర్టు తీర్పు ప్రతిని మా లీగల్‌ టీమ్‌ పరిశీలించింది. నిబంధనల ప్రకారం దీనిపై డివిజనల్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ చేసుకునే హక్కు మాకు ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నాం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement
Advertisement