ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఎవిన్ లూయీస్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే లూయీస్ డకౌట్‌గా వెనుదిరిగి ఆ అపప్రథను సొంతం చేసుకున్న 58వ ఆటగాడిగా నిలిచాడు. శనివారం చెన్నైతో మ్యాచ్‌లో లూయిస్..చాహర్ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్ తొలి బంతికి లూయీస్ వికెట్లు ముందు దొరికిపోయాడు. ఫలితంగా ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో లూయీస్ చేరిపోయాడు.
2008 ఐపీఎల్‌లో బాలచంద్ర అఖిల్ అరంగేట్రం మ్యాచ్‌లో అవుటైన తొలి ఆటగాడు కాగా, 2017లో శామ్యూల్ బద్రి ఇదే తరహాలో పెవిలియన్ చేరిన 57వ ఆటగాడు. ఇదిలా ఉంచితే, ఈ రోజు మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(15) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద రోహిత్.. వాట్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అంబటి రాయుడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment