హరారే: షాహిద్ ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్; 3/25)తో జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 25 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది.
ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (50 బంతుల్లో 70; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించగా చివర్లో ఆఫ్రిది వేగంగా ఆడి స్కోరును పెంచాడు. చటారాకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు), ఓపెనర్ సిబంద (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) మినహా ఎవరూ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారు.
తొలి టి20లో పాక్ గెలుపు
Published Sat, Aug 24 2013 1:44 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
Advertisement