అక్షత్ రెడ్డి సెంచరీ
రాంచీ: జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (133; 17 ఫోర్లు, 1 సిక్స్) ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. అహ్మద్ ఖాద్రీ (73; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆశిష్ రెడ్డి (54 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించగా... విహారి (41) ఫర్వాలేదనిపిం చాడు.
ఐదో వికెట్‌కు అక్షత్, ఖాద్రీ 114 పరుగులు జోడించారు. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం మరో 179 పరుగులు వెనుకబడి ఉంది. ఆశిష్‌తో పాటు క్రీజ్‌లో మిలింద్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు. ఇరు జట్ల ఒక్కో ఇన్నింగ్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మ్యాచ్ ‘డ్రా’ కావడం దాదాపు ఖాయం.
హైదరాబాద్ 377/7
Published Sat, Jan 24 2015 12:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement