ఇండియా బ్యాటింగ్ వర్సెస్ పాక్ బౌలింగ్!
ఉపఖండం క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న దాయాదుల క్రికెట్ సంగ్రామానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఢాకా వేదికగా భారత్-పాకిస్థాన్ ట్వంటీ-20 మ్యాచ్ ఆడనున్నారు. రెండు టీమ్‌లు ఈ మ్యాచును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. చిరకాల ప్రత్యర్థిపై విజయం కోసం ఉవ్విళ్లూరుతుండటంతో ఈ పోరు హోరాహోరిగా జరుగడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బలంగా ఉన్న భారత్ బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ ఆటాక్ హోరాహోరీ పోరు జరుగడం ఖాయమని క్రికెట్ దిగ్గజాలు, మాజీ ప్లేయర్లు విశ్లేషిస్తున్నారు..
భారత బ్యాట్స్‌మన్ ఈ మధ్యకాలంలో చాలా స్థిరంగా ఆడుతున్నారు. కానీ మా వద్ద బలమైన బౌలింగ్ ఆటాక్ ఉంది. కాబట్టి మ్యాచ్ గొప్పగా జరిగే అవకాశముంది'
- షోయబ్ మాలిక్, పాకిస్థాన్ క్రికెటర్
'ఔను వాళ్ల వద్ద బలమైన బౌలింగ్ దాడి ఉంది. కానీ మేం మా బలాలపైనే ఎక్కువగా శ్రద్ధపెట్టాం'
- రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్
'ఓపెనర్లను పెవిలియన్ పంపడం ద్వారా మొదటి ఆరు ఓవర్లను బాగా ఉపయోగించుకోవాలని మా ఫాస్ట్ బౌలర్లు భావిస్తున్నారు. అదే మా బలం కూడా'
- షాహిద్ ఆఫ్రిది, పాకిస్థాన్ క్రికెటర్
'పాకిస్థాన్ పేస్ ఆటాక్‌ను భారత బ్యాటింగ్ సమర్థంగా ఎదుర్కోగలదు. కానీ పాకిస్థాన్ భారత బౌలింగ్ దాడిని ఎదుర్కొనేంత సమర్థంగా కనిపించడం లేదు'
- సునీల్ గవస్కర్, భారత క్రికెటర్
'భారత్ ఆడుతున్న తీరు చూస్తేంటే.. ఈ మ్యాచులో వాళ్లే ఫేవరెట్స్ అని స్పష్టమవుతోంది'
- వసీం అక్రం, పాకిస్థాన్ క్రికెటర్
'టీ-20లో భారత్‌కు నంబర్ వన్ బౌలర్‌గా నెహ్రూ తనను తాను నిరూపించుకున్నాడు. అది టీమిండియాకు బలం కానుంది'
- జవగళ్ శ్రీనాథ్, భారత క్రికెటర్
'అశ్విన్ బాగా ఆడుతున్నంత మాత్రాన టీమిండియా హర్భజన్ సింగ్‌ను పక్కనపెట్టజాలదు'
- సక్లయిన్ ముస్తాక్, పాకిస్థాన్ స్పిన్నర్