ముంబై: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశ మ్యాచ్‌లు దాదాపు అంతిమ దశకు చేరుకోవడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై 16 పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ విజయం హైదరాబాద్‌ను వరిస్తే 14 పాయింట్లతో ముంబై, హైదరాబాద్ సమంగా నిలుస్తాయి. ఈ మ్యాచ్ ముంబై కన్నా హైదరాబాద్‌కు మరింత కీలకం. ఒకవేళ ముంబైతో మ్యాచ్‌లో రైజర్స్ ఓడిపోతే తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దానితో పాటు కోల్‌కతా, పంజాబ్ జట్ల ఫలితాలపై ఆధారపడి సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ప్లేఆఫ్‌కు నేరుగా చేరాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ గెలవాల్సి ఉంది.
ఇప్పటివరకు హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్, ఓపెనర్ వార్నర్ లేకుండానే నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ బరిలో దిగనుంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడి ఒక శతకం, 8 అర్ధశతకాలతో అతను 692 పరుగుల్ని సాధించాడు. కీలక సమయంలో వార్నర్ లేకపోవడం సన్‌రైజర్స్ జట్టుకు పెద్ద లోటు. వార్నర్ స్థానంలో మార్టిన్ గప్టిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మనీశ్ పాండే పుంజుకోగా... కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంకా ధాటి కనబరచలేకపోతున్నాడు. విజయ్ శంకర్ అంచనాలకు తగ్గట్లుగా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లోనూ రషీద్ ఖాన్, నబీపై రైజర్స్ ఆధారపడుతోంది. వీరిద్దరితో పాటు పేసర్లు భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నారు.
మరొకవైపు లీగ్ ప్రారంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు కుదురుకుంది. హర్దిక్ పాండ్యా, పొలార్డ్ విధ్వంసక ఆటతీరుతో కొన్ని అద్భుతమైన విజయాలు మూటగట్టుకుని ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. వీరిద్దరూ తమ బ్యాట్‌లకు పనికల్పిస్తే హైదరాబాద్ ఎంత లక్ష్యం విధించినా తక్కువే అవుతుంది. మరోవైపు ప్లే ఆఫ్ బెర్తుకు కేవలం ఒక విజయం దూరంలోనే ఉండటంతో ఈ మ్యాచ్‌లోనే దాన్ని సాధించాలని ముంబై పట్టుదలగా ఉంది. కెప్టెన్ రోహిత్ (307 పరుగులు), డికాక్ (393 పరుగులు) ఓపెనింగ్‌లో రాణిస్తుండగా... మిడిలార్డర్‌లో హార్దిక్, పొలార్డ్ అదరగొడుతున్నారు. సూర్యకుమార్, కృనాల్ భారీ స్కోర్లపై దృష్టి సారిస్తే ముంబై బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారుతుంది. ఏది ఏమైనా ఇరు జట్లు ప్లేఆఫ్‌ను దృష్టిలో పెట్టుకుని పోరుకు సిద్ధమవుతుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
ముంబై
రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బరిందర్ శ్రాన్, రాహుల్ చాహర్, బుమ్రా, లసత్ మలింగా
సన్‌రైజర్స్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), సాహా, మార్టిన్ గప్టిల్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, విజయ శంకర్, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, బాసిల్ థంపి
Comments
Please login to add a commentAdd a comment