సన్‌రైజర్స్‌ లక్ష్యం 163 | Quinton de Kock hit 69 Help Mumbai Indians to 162 | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ లక్ష్యం 163

Published Thu, May 2 2019 9:55 PM | Last Updated on Thu, May 2 2019 10:31 PM

Quinton de Kock hit 69 Help Mumbai Indians to 162 - Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే ముంబై 36 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ(24;5 ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత డీకాక్‌-సూర్యకుమార్‌ యాదవ్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరూ 54 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత సూర్యకమార్‌(23) రెండో వికెట్‌గా ఔటయ్యడు.  

ఆపై పరుగు వ్యవధిలో లూయిస్‌(1) పెవిలియన్‌ చేరడంతో ముంబై 91 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. హార్దిక్‌ పాండ్యా(18), పొలార్డ్‌(10)లు కూడా నిరాశపరచడంతో ముంబై స్కోరులో వేగం తగ్గింది. కాగా, డీకాక్‌(69 నాటౌట్‌; 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ నబీలకు తలో వికెట్‌ దక్కంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement