ఖాట్మాండు: నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు వన్డే అరంగేట్రం షురూ అయ్యింది. వచ్చే నెల్లో నెదర్లాండ్ జట్టుతో నేపాల్ జట్టు రెండు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు నేపాల్‌తో వన్డే సిరీస్‌లో తలపడే విషయాన్ని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు(కేఎన్‌సీబీ) తాజాగా ప్రకటించింది. ఇటీవల నేపాల్‌తో పాటు నెదర్లాండ్, యూఏఈ, స్కాట్లాండ్ జట్లకు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జూన్1 నుంచి ఆయా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల ఆధారంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా కేటాయించునున్నారు.
గతేడాది ఐసీసీ నిర్వహించిన వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్ విజేతగా నిలవడంతో దానికి వన్డే హోదా దక్కింది. మరొకవైపు ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా స్కాట్లాండ్, యూఏఈ, నేపాల్ జట్లకు వన్డే హోదా లభించింది. అయితే నేపాల్ ఖాతాలో ఒక్క రేటింగ్ పాయింట్ కూడా లేకపోగా, నెదర్లాండ్స్‌కు 13 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ర్యాంకుల కోసం ఈ రెండు జట్లు చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడిన తర్వాత మాత్రమే వాటికి ర్యాంకులు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment