డీఎస్పీగా భారత మహిళా వికెట్‌ కీపర్‌ | Sushma Verma Felicitated By The Himachal Pradesh Government, Offered Post Of DSP | Sakshi
Sakshi News home page

డీఎస్పీగా భారత మహిళా వికెట్‌ కీపర్‌

Published Wed, Aug 9 2017 8:03 PM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

డీఎస్పీగా భారత మహిళా వికెట్‌ కీపర్‌

డీఎస్పీగా భారత మహిళా వికెట్‌ కీపర్‌

సిమ్లా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళా క్రికెటర్లకు ఊహించని రీతిలో ప్రోత్సాహక బహుమతులు అందుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ మహిళల జట్టులో ఒక్కోక్కరికి రూ.50 లక్షలు అందించగా.. రైల్వే శాఖ తమ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ కొంత నగదు బహుమతి కూడా ఇచ్చింది. ఇక వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నజరానలు ప్రకటించాయి.
 
హిమచాల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీర భద్ర సింగ్‌ ఆ రాష్ట్ర లేడీ క్రికెటర్‌ భారత వికెట్‌ కీపర్‌ సుష్మావర్మకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్సీ ఉద్యోగం ఇస్తానని అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఆమెకు రూ.5 లక్షల చెక్కుతో పాటు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. సుష్మాను ప్రశింసిస్తూ ఈ విషయాన్ని సీఎం అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.
 
हिमाचल का नाम अंतर्राष्ट्रीय स्तर पर ऊँचा करने वाली @BCCIWomen की खिलाड़ी @ImSushVerma को 5 लाख की प्रोत्साहन राशि देकर सम्मानित किया है 1/1 pic.twitter.com/IQsTgmCJcw
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement