sushma verma
-
డీఎస్పీగా భారత మహిళా వికెట్ కీపర్
సిమ్లా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళా క్రికెటర్లకు ఊహించని రీతిలో ప్రోత్సాహక బహుమతులు అందుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ మహిళల జట్టులో ఒక్కోక్కరికి రూ.50 లక్షలు అందించగా.. రైల్వే శాఖ తమ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ కొంత నగదు బహుమతి కూడా ఇచ్చింది. ఇక వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నజరానలు ప్రకటించాయి. హిమచాల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర భద్ర సింగ్ ఆ రాష్ట్ర లేడీ క్రికెటర్ భారత వికెట్ కీపర్ సుష్మావర్మకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్సీ ఉద్యోగం ఇస్తానని అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఆమెకు రూ.5 లక్షల చెక్కుతో పాటు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. సుష్మాను ప్రశింసిస్తూ ఈ విషయాన్ని సీఎం అధికారిక ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశారు. हिमाचल का नाम अंतर्राष्ट्रीय स्तर पर ऊँचा करने वाली @BCCIWomen की खिलाड़ी @ImSushVerma को 5 लाख की प्रोत्साहन राशि देकर सम्मानित किया है 1/1 pic.twitter.com/IQsTgmCJcw — Virbhadra Singh (@virbhadrasingh) 8 August 2017 2011లో అండర్-19 స్థాయిలో జరిగిన మహిళల క్రికెట్ టోర్నమెంట్లో హిమచల్ ప్రదేశ్ కు సుష్మ కెప్టెన్ గా చేశారు. ఆ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ రన్నరప్ గా నిలిచింది. హిమచల్ ప్రదేశ్ తరపున జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న తొలి క్రికెటర్ సుష్మే కావడం విశేషం. ప్రస్తుతం సుష్మా వర్మ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో 20 ఫోర్లు 7 సిక్సులతో రెచ్చిపోయిన వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు కూడా డీఎస్సీ ఉద్యోగం లభించింది. మిథాలీ రాజ్‌కు తెలంగాణ సీఎం కోటి నజరాన 600 గజాల ఇంటి స్థలం ప్రకటించిన విషయం తెలిసిందే. అసంతృప్తి వ్యక్తం చేసి హిమాచల్ షూటర్.. దేశానికి ఒలంపిక్ కాంస్యం అందించిన షూటర్ విజయ్‌కుమార్ తనకు ప్రోత్సాహకం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హిమాచల్ ప్రదేశ్ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయ్ కుమార్ పలు ఈవెంట్లలో 150 మెడల్స్ వరకు సాధించాడు. అయినా రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మరో క్రికెటర్‌కు డీఎస్పీ ఉద్యోగం
సిమ్లా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత క్రికెటర్లపై వరాల జల్లు కురుస్తోంది. ఇప్పటికే హర్మన్ ప్రీత్ కౌర్ కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం ముందుకురాగా, మరో మహిళా క్రికెటర్ సుష్మా వర్మకు సైతం డీఎస్పీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా సేవలందిస్తున్న సుష్మాకు డీఎస్పీ హోదా కల్పించనున్నట్లు హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు. సిమ్లాలో 1992, నవంబర్ 3వ తేదీన జన్మించిన సుష్మా.. జాతీయ స్థాయిలో క్రికెట్ కెరీర్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమెన్ గా ఎంచుకుంది. 2011లో అండర్-19 స్థాయిలో జరిగిన మహిళల క్రికెట్ టోర్నమెంట్లో హిమచల్ ప్రదేశ్ కు సుష్మ కెప్టెన్ గా చేశారు. ఆ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ రన్నరప్ గా నిలిచింది. దాంతోపాటు హిమచల్ ప్రదేశ్ తరపున జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న తొలి క్రికెటర్ సుష్మే కావడం మరో విశేషం. ప్రస్తుతం సుష్మా వర్మ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. -
15 ఏళ్లకే పీహెచ్డీ చేస్తోంది!!
సాధారణంగా 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? టెంత్ క్లాస్ పరీక్షలు రాసి.. కాలేజీకి వెళ్తున్నామన్న సంబరంలో ఉంటారు కదూ. కానీ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుష్మా వర్మ 15 ఏళ్లకే పీజీ పూర్తి చేయడమే కాదు, ఏకంగా ఇప్పుడు పీహెచ్డీ కూడా మొదలుపెడుతోంది. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ యూనివర్సిటీలో పర్యావరణ మైక్రోబయాలజీలో ఆమె పరిశోధన చేయనుంది. అలాగని ఈమె చిన్నతనం నుంచి సకల సౌకర్యాల మధ్య చదువుకుందని అనుకుంటున్నారా? కాదు.. ఆమె ఓ సామాన్య పారిశుధ్య కార్మికుడి కూతురు. ఈ ఏడాదే ఆమె ఎంఎస్సీ మైక్రోబయాలజీలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. పీహెచ్‌డీకి సంబంధించిన ప్రవేశ పరీక్షలో కూడా ఆమె ఏడోర్యాంకు పొందింది. అయితే ప్రస్తుతం మైక్రోబయాలజీ విభాగంలో కేవలం నాలుగు సీట్లే ఖాళీ ఉన్నాయని, ఈమె కోసం ప్రత్యేకంగా అదనపు సీటు కేటాయించాల్సి వస్తుందని ఆ శాఖాధిపతి నవీన్ కుమార్ అన్నారు. ప్రత్యేక విభాగంలో ఆమెకు తప్పనిసరిగా పీహెచ్డీ అడ్మిషన్ ఇస్తామని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్ఎస్ సోబ్తి తెలిపారు. 15 ఏళ్ల చిరుప్రాయంలో ఎవరూ అందుకోనంత ఎత్తుకు వెళ్లిందని ఆయన అన్నారు. ఆమెకు హాస్టల్ సీటు, స్కాలర్ షిప్ కూడా ఇస్తామని తెలిపారు.