ఓవరాల్ చాంప్ తెలంగాణ
ఓవరాల్ చాంప్ తెలంగాణ
Published Fri, Sep 2 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
హైదరాబాద్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇటీవల జరిగిన ట్రేడిషనల్ నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ బాక్సింగ్ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. అండర్-14, 17, 19 విభాగాల్లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ బాక్సర్లు మెరిశారు. ఏకంగా 23 పసిడి పతకాలతో పాటు 7 రజతాలను సాధించి సత్తా చాటారు. ఈ క్రీడలు ఆగస్టు 26 నుంచి 29 వరకు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు అభినందించారు.
Advertisement
Advertisement