తారిఖ్, సిమర్ ప్రీత్‌లకు అభినందన | tharik -seemar pritham congrats | Sakshi
Sakshi News home page

తారిఖ్, సిమర్ ప్రీత్‌లకు అభినందన

Published Sun, Mar 2 2014 2:02 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

తారిఖ్, సిమర్ ప్రీత్‌లకు అభినందన - Sakshi

తారిఖ్, సిమర్ ప్రీత్‌లకు అభినందన

హైదరాబాద్: జాతీయ స్థాయి టోర్నీలో రాణించిన హైదరాబాద్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు తారిఖ్, సిమర్ ప్రీత్‌లను స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్) అభినందించింది.

 

వీరిద్దరు రాజీవ్‌గాంధీ సాకర్ టోర్నమెంట్‌లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇందులో రాణించిన తారిఖ్, సిమర్ ప్రీత్‌లు భారత ఫుట్‌బాల్ శిబిరానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్‌సీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో భారత సాకర్ జట్టు మాజీ సారథి విక్టర్ అమల్‌రాజ్ హాజరై వారిద్దరిని ప్రశంసించారు.
 

 

రతిభ వుండి ఆర్థికంగా వెనుకబడిన ఇలాంటి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఎస్‌సీఎఫ్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని ఆ సంస్థ అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. యువతలోని ప్రతిభాపాటవాలను వెలికితెచ్చి వారి కలల్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని సీఏఏఆర్‌ఎంఐసీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రతినిధి కార్తీక్ దంతు పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement