పురుషుల ఆర్చరీ జట్టుకు దక్కని రియో బెర్త్ | The men's archery team does not place in Rio berth | Sakshi
Sakshi News home page

పురుషుల ఆర్చరీ జట్టుకు దక్కని రియో బెర్త్

Published Fri, Jun 17 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

The men's archery team does not place in Rio berth

అంటల్యా: ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల ఆర్చరీ జట్టుకు స్థానం లేకుండా పోయింది. వరల్డ్ కప్ స్టేజి 3 క్వార్టర్స్‌లో అతాను దాస్, జయంత తాలూక్‌దార్, మంగళ్ సింగ్ చాంపియాలతో కూడిన జట్టు 4-5 తేడాతో మలేసియా చేతిలో కంగుతింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇది తుది టోర్నీ.

బెర్త్ దక్కించుకోవాలంటే టాప్-3లో నిలవాల్సి ఉండగా చాంపియా పేలవ ఫామ్‌తో జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరోవైపు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగం సెమీస్‌లో అతాను దాస్  0-6తో యు బోంచన్ (కొరియా) చేతిలో ఓడాడు. అయితే కాంస్యం కోసం ఆదివారం పోటీపడనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement