ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్ | Tommy Sugiarto leads Delhi Acers to Premier Badminton League summit clash | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్

Published Fri, Jan 15 2016 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్

ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
 బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఢిల్లీ 4-3 తేడాతో చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. ముందుగా జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ జోడి కూన్ కీట్ కీన్-టాన్ బూన్ హెంగ్ 15-10, 15-14తో చెన్నై ద్వయం ప్రణవ్ చోప్రా-క్రిస్ అడ్‌కాక్‌ను ఓడించింది. ఆ తర్వాత హోరాహోరీగా సాగిన తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 14-15, 15-10, 15-7తో సోని డి కూంకురోపై గెలుపొందాడు.
 
  తొలి గేమ్ కోల్పోయినా అజయ్ పట్టుదలగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేయడంతో ఢిల్లీ ఆధిక్యం 2-0కు పెరిగింది. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో చెన్నై జంట క్రిస్ అడ్‌కాక్-జెబదియన్ 15-9, 15-14తో కీట్ కీన్-గాబ్రియెల్ అడ్‌కాక్‌ను చిత్తు చేసింది. అనంతరం జరిగిన తమ ట్రంప్ మ్యాచ్‌లో పీవీ సింధు 15-6, 15-7తో పీసీ తులసిని చిత్తుగా ఓడించి స్కోరు సమం చేసింది. చివరగా జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో  సుగియార్తో (ఢిల్లీ ట్రంప్ మ్యాచ్)15-11, 15-14తో లెవెర్‌డెజ్‌పై గెలుపొంది ఢిల్లీని ఫైనల్ చేర్చాడు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే రెండో సెమీస్‌లో అవధ్ వారియర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement