కరోనాపై కోహ్లి స్పందన.. | Virat Kohli's Message On Coronavirus Pandemic | Sakshi
Sakshi News home page

కరోనాపై కోహ్లి స్పందన..

Published Sat, Mar 14 2020 2:42 PM | Last Updated on Sat, Mar 14 2020 2:42 PM

Virat Kohli's Message On Coronavirus Pandemic - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వాయిదా పడింది. వచ్చే నెల 15వ తేదీ వరకూ వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చిన బీసీసీఐ దానిని వాయిదా వేయక తప్పలేదు. కాగా, కరోనా వైరస్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిసారి స్పందించాడు.

కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని కోహ్లి తెలిపాడు.  కరోనా వైరస్ వచ్చాక నివారణ కంటే ముందుజాగ్రత్తే మేలు అని కోహ్లి ట్వీట్ చేశాడు. ‘అందరూ కరోనా వైరస్‌పై పోరాడేందుకు మరింత దృఢ సంకల్పంతో ముందుకు కదలండి.. అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి’ అంటూ కోహ్లి సూచించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు క్రీడల పోటీలను వాయిదా వేసిన నేపథ్యంలో కోహ్లి తన అభిమానులకు ముందస్తు జాగ్రత్తలు చెప్పారు. (వాయిదా వేసి మంచిపని చేసింది : గవాస్కర్‌)

ఇది మనకు పరీక్షా సమయం..
‘ప్రస్తుతం మనకు పరీక్షా సమయం. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొందాం. అంతా మనో ధైర్యంతో ఉండాలి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు సూచించే టిప్స్‌ను తప్పక పాటించండి’ అని టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ట్వీట్‌ చేశాడు. (అవీ... ఇవీ... అన్నీ కరోనా వల్లే! )


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement