యజువేంద్ర చహల్, తనిష్కా కపూర్ (ఫైల్ ఫొటో)
బెంగళూరు: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. గత కొంతకాలం నుంచి ఓ నటితో డేటింగ్‌తో ఉన్న క్రికెటర్ త్వరలో ఆమెను పెళ్లాడనున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ వీరు పలు ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని హాజరయ్యారు.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ త్వరలోనే కన్నడ నటి తనిష్కా కపూర్‌ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. చహల్ అనుకున్నట్లు జరిగితే ఈ ఐపీఎల్ సీజన్ ముగియగానే వీరి వివాహం అవుతుందని కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. చహల్, నటి తనిష్కలు పలు కార్యక్రమాలకు కలిసి హాజరుకావడం ఈ వదంతులకు ఆజ్యం పోసినట్లయింది. తనిష్క సోషల్ మీడియా పోస్టులకు చహల్ కచ్చితంగా లైక్స్ కొట్టడంతో కామెంట్లు చేస్తూ వీరి బంధాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపించాడు. అయితే ఇరు కుటుంబాల నుంచి వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అయితే క్రికెటర్లు, హీరోయిన్ల రిలేషన్‌షిప్ ఎప్పటినుంచో కొనసాగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా ఠాకూర్ నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ-అనుష్క వరకు చాలా జంటలు ఇలానే ఒక్కటయ్యాయి. హర్భజన్- గీతాబస్రా, యువరాజ్ సింగ్-హజెల్ కీచ్, జహీర్ ఖాన్-సాగరికా ఘట్గేలు ఈ తరహాలోనే విహహం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment