ఘనంగా రజనీకాంత్ జన్మదినం
Published Fri, Dec 13 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
వేలూరు, న్యూస్‌లైన్:సూపర్‌స్టార్ రజనికాంత్ 64వ జన్మదిన వేడుకలను వేలూరు జిల్లాలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. రజనీ అభిమానుల సంఘం జిల్లా కోశాధికారి షోళింగర్ రవి ఆధ్వర్యంలో అభిమానులు ఆల యాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి రజనీ క్షేమంగా ఉండాలని పూజలు చేశారు. ముం దుగా షోళింగర్ బస్టాండ్ నుంచి అభిమానులు ఊరేగింపుగా వెళ్లి ఈశ్వరన్ ఆలయం, సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, నూతన దుస్తులు, స్వీట్లు అందజేరు. అనంతరం విద్యార్థుల సమక్షంలో 64 కిలోల కేక్‌ను కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అభిమానుల సంఘం యూనియన్ కార్యదర్శి కేశవన్, ఉపాధ్యక్షులు సుబ్రమణి, జాయింట్ కార్యదర్శి షణ్ముగం, మురుగన్, అభిమానులు రాజ, సునిల్, మహేష్, శంకర్, మణి, సుందరమూర్తి, నేతాజీ పాల్గొన్నారు.జర్మనీ దేశస్తులచే వేడుకలు: జిల్లాలోని కలాంబట్టు గ్రామంలో జర్మనీ దేశానికి చెందిన అభిమానులు రజనీకాంత్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవి వారితో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. నాగపూండి, తాలికల్ గ్రామాల్లోని నిరుపేద మహిళలకు చీరలు పంచి పెట్టారు.
షోళింగర్‌లో..
సూపర్‌స్టార్ రజనీ జన్మదిన వేడుకలు సందర్భంగా గురువారం కోలాహలంగా నిర్వహించారు. వేలూరు జిల్లా రజనీ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు సందర్భంగా పట్టణం వ్యాప్తంగా కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించారు. బస్టాండు సమీపంలో వేలూరు జిల్లా రజనీ అభిమానుల సంఘం కోశాధికారి రవి ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం చేశారు. అంతకుముందు ఉదయం సోయపురీశ్వరస్వామి ఆలయంలో రజనీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement