హలో కమల్ కూతురిక్కడ! | hello i am kamal haasan Daughter says shruti haasan | Sakshi
Sakshi News home page

హలో కమల్ కూతురిక్కడ!

Published Sat, Jul 18 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

హలో కమల్ కూతురిక్కడ!

హలో కమల్ కూతురిక్కడ!

 మీకు నటి శ్రుతిహాసన్‌తో మాట్లాడే అవకాశం కలిగందా? ఆమె ముంబయిలో పెరిగారు. విదేశాల్లో చదివారు. అనే ఉద్దేశంతో పొరపాటున శ్రుతితో ఆంగ్లంలో మాట్లాడుదాం అనుకునేరు సుమా, అనవసరంగా బుక్కయైపోతారు. ఇలాగే ఇటీవల ఒకరు శ్రుతిహాసన్‌తో ఆంగ్లంలో మాట్లాడబోతే హలో నాకు తమిళభాష రాదని ఆంగ్లంలో మాట్లాడుతున్నారా? కమలహాసన్ కూతురిక్కడ. తమిళంలో నాకంటే బాగా మాట్లాడగలరా? అంటే ఆ వ్యక్తిని రఫ్ ఆడించేశారట. చెన్నైలోనే అనుకునేరు. ఆంధ్రాలో అయితే అక్కడమ్మాయిలాగా ప్రవర్తిస్తారట.
 
  ఇక ముంబయిలో అయితే హిందీలో దుమ్మురేపుతారట. ఇలా తన కూతురి ఎదుగుదలతో పాటు భాషాభివృద్ధిని చూసి కమలహాసన్ చాలా గర్వంగా ఫీలవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమలహాసన్, శ్రుతిహాసన్ కలిసి కబుర్లు చెప్పుకోవడం అరుదనే విషయం తెలిసిందే. ఎప్పుడైనా తండ్రిని చూడాలనించినప్పుడు శ్రుతి చెన్నైకి వస్తారు. అప్పుడు కమల్ శ్రుతిని సైకిల్‌పై ఎక్కించుకుని నగరం అంతా తిప్పుతారట. ఎవరయినా గుర్తు పడతారేమోనని తనకు శిరస్త్రాణం ధరించుకుంటారట.
 
 ఇది తండ్రీకూతుళ్ల అనుబంధం కథ కాగా కమలహాసన్ నటించిన తాజా చిత్రం పాపనాశం చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రుతిహాసన్ ముంబయిలో తన స్నేహితులు సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారట. ఇది తండ్రీకూతుళ్ల ప్రేమాభిమానానికి  చిహ్నం. తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లోనూ తన ఆధిక్యతను చాటుకుంటున్న శ్రుతి నటించిన తమిళ చిత్రం పులి త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తున్నారు. ఇక హిందీలో లేటెస్ట్‌గా కత్రినాకైఫ్ అవకాశాన్ని కొట్టేశారనే ప్రచారం జోరందుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement