ప్రియుడి ప్రేమను గెలుచుకున్న హిజ్రా
బెంగళూరు: కర్ణాటకలోని గౌరిబిదనూరు పట్టణంలో ఓ హిజ్రాకు వివాహభాగ్యం కలిగింది. గౌరిబిదనూరు పట్టణం లో నివాసం ఉంటున్న హిజ్రా ఫిజారా (24)ను ముజీబ్ (24) అనే వ్యక్తితో శుక్రవారం వివాహం జరిగింది. పట్టణంలోని 19వ వార్డులో మహిళా రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యమ్మ నేతృత్వంలో ఈ వివాహం జరగింది. గతంలో ముజీబ్తో హిజ్రా ఫిజారాకు పరిచయం ఏర్పడింది.
అదికాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. దాంతో ముజీబ్ తాను ప్రేమించుకుంటున్నామని తమకు పెళ్లి చేయాలంటూ మహిళా రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యమ్మను ఫిజారా ఆశ్రయించింది. దాంతో ముజీబ్ను పిలిపించి భాగ్యమ్మ మాట్లాడారు. తాను ఫిజారాతో వివాహనికి సుముఖంగా ఉన్నట్లు ముజీబ్ వెల్లడించారు. దీంతో భాగ్యమ్మ పెళ్లిపెద్దగా ఆ ఇద్దరికి పెళ్లి జరిపించారు.