ఆలయం వద్ద వధూవరులు
చెన్నై, టీ.నగర్: తూత్తుకుడిలో పోలీసుల సాక్షిగా బుధవారం హిజ్రా పెళ్లి జరిగింది. వివరాలు... తూత్తుకుడి పాలముత్తునగర్‌కు చెందిన బాలసుబ్రమణ్యం, సుబ్బలక్ష్మి కుమారుడు అరవిందకుమార్. రైల్వే శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన పేచ్చిరామన్, వళ్లి దంపతుల కుమార్తె శ్రీజ. హిజ్రా. ఇలా ఉండగా వీరిరువురు వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. అయితే ఇందుకు ఇరుకుటుంబాల తల్లిదండ్రులు వ్యతిరేకించి ఆ తరువాత అంగీకారం తెలిపారు.
ఇలా ఉండగా ఇరు కుటుంబాలు వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేసి బంధువులకు పంచిపెట్టారు. వీరి వివాహం తూత్తుకుడి శివన్ కోవిల్‌లో బుధవారం ఉదయం జరిపేందుకు నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసి బంధువులతో పాటు వధూవరులు అక్కడికి చేరుకోగా ఆలయ నిర్వాహకులు ఈ వివాహం జరిపేందుకు నిరాకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. ఆ తరువాత పోలీసుల సమక్షంలో వధూవరులకు వివాహం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment