ముఖ్యమంత్రికి ఉలికిపాటు ఎందుకు..?
సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
తిరుమలాయపాలెం(పాలేరు): సీపీఎం అంటే ముఖ్యమంత్రికి ఉలికిపాటు ఎందు కని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే సీపీఎం ప్రజాపోరాటాలు చేస్తూనే ఉంటుందని అన్నారు. సీపీఎం చేపట్టిన పాదయాత్ర బుధవారం ఖమ్మం తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా వద్ద జిల్లా లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తమ్మినేని భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో భారీగా దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోయిన గిరిజనులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతుందని విమర్శించారు.