‘కందుల ధర ఢమాల్‌’పై సీఎస్‌ ఆరా | cs enquiry about kandi price | Sakshi
Sakshi News home page

‘కందుల ధర ఢమాల్‌’పై సీఎస్‌ ఆరా

Published Wed, Jan 4 2017 4:28 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

cs enquiry  about kandi price

‘సాక్షి’కథనంపై సర్కారు స్పందన
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కంది ధర పడిపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌ ఆరా తీశారు. ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘‘చేతి‘కంది’నా చేయూత కరువు’’కథనంపై ఆయన స్పందించారు. గతేడాది కంటే క్వింటాలుకు రూ. 2 వేలు పైగా ధర పడిపోవడానికి గల కారణాలను తెలపాలంటూ వ్యవసాయ శాఖను ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలేంటో నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement