చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు రెండేళ్ల పాపను బలితీసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంకాల్‌లో ఉన్న హర్షిత ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాలేజీ బస్సును డ్రైవర్ రివర్స్ తీసుకుంటుండగా... అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి రెండేళ్ల కుమార్తె ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రం కింద పడడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కన్నబిడ్డ కళ్ల ముందే మృతి చెందడంతో సెక్యూరిటీ గార్డు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.