హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం | hcu professor selected public health leader ship | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం

Published Fri, May 15 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం

 హైదరాబాద్: అమెరికాలోని ఎమోరి యూనివర్సిటీ నిర్వహించే పబ్లిక్ హెల్త్ లీడర్‌షిప్ కార్యక్రమానికి హెచ్‌సీయూ మెడికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ బి.ఆర్ శామన్న ఎంపికయ్యారు. 2015-16 విద్యా సంవత్సరానికి గాను ప్రజారోగ్య రంగంలో నైపుణ్యాల పెంపుదల, దీర్ఘకాలిక వ్యాధులపై పరిశోధన నిర్వహించే నిమిత్తం అమెరికా పలువురు ప్రతినిధులను ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసింది.

ఈ కార్యక్రమంలో శామన్న భాగస్వామి కానున్నారు. జూన్‌లో మొదలయ్యే ఈ ప్రత్యేక పరిశోధన కార్యక్రమం 2016 ఏప్రిల్ వరకు కొనసాగనుంది. యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) దీనికి సహకారం అందిస్తుంది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement